Ramcharan: హాట్ టాపిక్: పాన్ ఇండియా మూవీ కోసం చరణ్ భారీ పారితోషికం!

Ram Charan charges a bomb for pan India movie

  • శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రాజక్ట్ 
  • 200 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్న దిల్ రాజు
  • కథానాయికగా బాలీవుడ్ భామ కియారా
  • 80 కోట్ల పారితోషికం తీసుకుంటున్న చరణ్  

ఈవేళ మన స్టార్ హీరోలు చేస్తున్నవన్నీ ఇంచుమించు పాన్ ఇండియా రేంజి సినిమాలే కావడంతో వివిధ భాషలలో వాటి నిర్మాణం జరుగుతోంది. దీంతో వందల కోట్ల బడ్జెట్టుతో ఇవి నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇన్ని భాషల్లో చేస్తుండడంతో హీరోలు కూడా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంచుమించు బాలీవుడ్ టాప్ హీరోలు తీసుకునే రేంజిలో మన టాలీవుడ్ హీరోలు కూడా ఈ తరహా చిత్రాలకు పారితోషికాలను తీసుకుంటున్నారు.

ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ కూడా తాను నటించబోయే ఓ చిత్రానికి 80 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దక్షిణాదిన సూపర్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 200 కోట్ల బడ్జెట్టుతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో నటించడానికే చరణ్ 80 కోట్లు తీసుకుంటున్నాడట. ఇప్పుడిదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వుంది. ఈ చిత్రంలో చరణ్ పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఆయన సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

Ramcharan
Shankar
Kiara Advani
Dil Raju
  • Loading...

More Telugu News