Heli Ride: విజయవాడలో నేటి నుంచి 'హెలీ రైడ్'

Heli ride in Vijayawada

  • హెలికాప్టర్ ద్వారా బెజవాడ సోయగం వీక్షించే చాన్స్
  • టూరిజం శాఖ, దుర్గగుడి ఆధ్వర్యంలో హెలీ రైడ్
  • 6 నిమిషాల వాయు విహారానికి రూ.3,500
  • 13 నిమిషాలకు రూ.6 వేలు

విజయవాడ నగర అందాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి ఈ నెల 17 వరకు విజయవాడలో హెలీ రైడ్ సేవలు అందించనున్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలీ రైడ్ నిర్వహిస్తారు. టూరిజం విభాగం, దుర్గమ్మ ఆలయ బోర్డు సంయుక్తంగా ఈ హెలీ రైడ్ ను నిర్వహిస్తున్నాయి.

ఇందులో భాగంగా 6 నిమిషాల పర్యటనకు రూ.3,500, 13 నిమిషాల గగన విహారానికి రూ.6 వేలుగా ధరలు నిర్ణయించారు. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ స్పందిస్తూ, హెలీ రైడ్ ను దుర్గమ్మ భక్తులు, ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Heli Ride
Vijayawada
Tourism Dept
Durga Temple
  • Loading...

More Telugu News