Anand Devarakonda: 'హైవే' పూర్తిచేసిన ఆనంద్ దేవరకొండ!

Highway movie shooting completed

  • మరో క్రైమ్ థ్రిల్లర్ గా 'హైవే'
  • కేవీ గుహన్ నుంచి వస్తున్న మరో సినిమా 
  • కథానాయికగా మానస రాధాకృష్ణన్ పరిచయం
  • నిన్నటితో షూటింగు పూర్తి

ఆనంద్ దేవరకొండ వరుసగా ఒక్కో ప్రాజెక్టును పూర్తిచేస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ 'పుష్పక విమానం' సినిమాను విడుదలకు రెడీ చేసిన ఆయన, ఆ తరువాత సినిమాగా 'హైవే'ను పట్టాలెక్కించాడు. కేవీ గుహన్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, నిన్నటితో షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఇది హైవే నేపథ్యంలో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తిస్తూ ఈ కథ నడుస్తుందని గుహన్ చెప్పారు. వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, తెలుగు తెరకి కథానాయికగా మానస రాధాకృష్ణన్ పరిచయమవుతోంది.

తెలంగాణ .. ఆంధ్ర .. కర్ణాటక ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగు జరిగినట్టుగా గుహన్ చెప్పారు. '118' సినిమా మాదిరిగానే ఈ సినిమాను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. సైమన్ కె కింగ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు..

  • Loading...

More Telugu News