: వారికి ఉద్యోగాలిస్తాననడం అవమానించడమే: టీఆర్ఎస్ శ్రావణ్


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును 2009 నుంచీ అడుగడుగునా అడ్డుకున్నది చంద్రబాబేనని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రావణ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన విద్యార్ధుల కుటుంబాలకు ఉద్యోగాలిస్తాననడం వారిని అవమానించడమేనని టీఆర్ఎస్ విమర్శించింది. మూడు వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసిన బాబు అమరుల ఆత్మశాంతి కోసం తెలంగాణలో ఒక్క కిలోమీటరైనా పాదయాత్ర చేయగలరా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను టీడీపీ, ఇతర పార్టీల నేతలు వసూళ్ల పార్టీగా విమర్శించడాన్ని ఆయన ఖండించారు. మహానాడులో హుండీలు పెట్టడం, ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో పారిశ్రామిక వేత్తలనుంచి విరాళాలు సేకరించడం వసూళ్లు కాదా? అంటూ శ్రావణ్ నిలదీశారు.

  • Loading...

More Telugu News