CM Jagan: ఆర్బీకేలపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సీఎం జగన్

CM Jagan reviews on RBKs

  • అగ్రి ఇన్ ఫ్రా ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష
  • ఆర్బీకేలపై అధికారులకు దిశానిర్దేశం
  • రైతులకు మంచి ధరలు వచ్చేలా చూడాలని ఆదేశాలు
  • ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగరాదని స్పష్టీకరణ

వైసీపీ సర్కారు వ్యవసాయ రంగానికి తోడ్పాటు నిచ్చేలా సమగ్ర సేవలు అందించే నిమిత్తం రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసింది. అయితే ఆర్బీకేలపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అగ్రి ఇన్ ఫ్రా ప్రాజెక్టుపై ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు మంచి ధరలు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల్లో నిరాశ ఉంటే వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవాలని నిర్దేశించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకోవాలని సూచించారు. ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు.

ఆర్బీకేల్లో నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతామని సీఎం జగన్ వెల్లడించారు. బహిరంగ విపణిలో కంటే ఆర్బీకేల్లోనే తక్కువ ధరకు విక్రయిస్తామని వివరించారు.

CM Jagan
RBK
Review
Andhra Pradesh
  • Loading...

More Telugu News