YSRCP: మంత్రి ఇంటికి కూతవేటు దూరంలోనే అధికారులు ఇంత నిర్లక్ష్యమా?: బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి

vishnu vardhan reddy slams ysrcp

  • ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు
  • ఎల్ఈడీ తెరలలో అన్యమత ప్రచారాల ప్రసారం
  • దేవాదాయ శాఖ నిర్లక్ష్యమే పూర్తికారణం  

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అన్య‌మ‌త ప్ర‌చారాన్ని ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేసుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు.

'దేవాదాయ శాఖ మంత్రి ఇంటికి కూతవేటు దూరంలోనే అధికారులు ఇంత నిర్లక్ష్యమా? విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలలో అన్యమత ప్రచారాలను ప్రసారం చేయడానికి దేవాదాయశాఖ నిర్లక్ష్యమే పూర్తికారణం' అని ఆయ‌న ఆరోపించారు.

'దీనికి బాధ్యులైన దేవాదాయ, ప్రభుత్వ సమాచార, పౌర సంబంధశాఖ అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రధాన ఆలయాల దగ్గరే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇతర ఆలయాల్లో ఆ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది ఏ మాత్రం పని చేస్తారో ఆలోచించవచ్చు' అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News