Foreigners: అక్టోబరు 15 నుంచి భారత్ వచ్చేందుకు విదేశీయులకు అనుమతి... చార్టర్డ్ విమానాల్లో మాత్రమే!
- భారత్ లో బాగా తగ్గిన కరోనా వ్యాప్తి
- 20 వేల దిగువన రోజువారీ కేసులు
- ఆంక్షలు సడలిస్తున్న కేంద్రం
- విదేశీయులకు వీసాలు జారీ చేయాలని నిర్ణయం
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. భారత్ లో రోజువారీ కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి అక్టోబరు 15 నుంచి విదేశీ పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు వీసాలు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
అయితే, విదేశీయులు చార్టర్డ్ విమానాల్లో వచ్చేందుకు మాత్రమే ఈ అనుమతి వర్తిస్తుంది. సాధారణ విమానాల్లో రావడానికి నవంబరు 15 నుంచి అనుమతించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశీయులకు అన్ని రకాల వీసాలను కేంద్రం గతేడాది నిలిపివేయడం తెలిసిందే.