Jagan: ఒంగోలులో ముఖ్యమంత్రి.. రెండో విడత 'వైఎస్సార్ ఆసరా' ప్రారంభించిన జగన్!

jagan releases asara funds

  • ఎన్నిక‌ల ముందు ఇ‌చ్చిన హామీలు నెర‌వేర్చుతున్నాం
  • అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఆదుకోలేదు
  • డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఆదుకుంటామ‌ని నేను చెప్పాను
  • గ‌త ఏడాది కూడా నేరుగా మ‌హిళ‌ల ఖాతాల్లో డ‌బ్బులు

ఏపీలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం రెండవ విడత నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ రోజు ఒంగోలు నుంచి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ మంత్రులు ఆదిమూల‌పు సురేశ్, బాలినేని, విశ్వ‌రూప్‌, పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల ముందు త‌న పాద‌యాత్రలో ఇచ్చిన హామీ మేర‌కు ఆస‌రా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు.

అప్ప‌ట్లో తాను పాద‌యాత్ర‌లో చేసిన వ్యాఖ్య‌ల వీడియోను ఈ సందర్భంగా ఆయ‌న చూపించారు. చంద్ర‌బాబు నాయుడు ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాల మాఫీ చేయ‌లేద‌ని అందులో ఆయ‌న అన్నారు. గ‌త ఏడాది కూడా మ‌హిళ‌ల‌కు నేరుగా డ‌బ్బులు అందించామ‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో సీ గ్రేడుకి చేరిన సంఘాలు ఇప్పుడు ఏ గ్రేడుకు చేరుకున్నాయ‌ని జ‌గ‌న్ చెప్పారు.

డ్వాక్రా గ్రూపు మహిళల ఖాతాల్లో ప్ర‌భుత్వం ఈ నిధుల‌ను నేరుగా జమ చేస్తోంది. నేటి నుంచి రెండో విడతలో 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల మ‌హిళ‌ల ఖాతాల్లో డ‌బ్బు ప‌డ‌నుంది. ఆయా సంఘాల్లో మొత్తం 78.76 లక్షల మంది మహిళలు స‌భ్యులుగా ఉన్నారు. మొత్తం  రూ.6,439.52 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చుచేస్తోంది. గత ఏడాది తొలి విడతలో ప్ర‌భుత్వం రూ.6,318.76 కోట్లు మ‌హిళ‌ల‌కు అంద‌జేసింది.

  • Loading...

More Telugu News