Gopichand: ఇన్నేళ్ల నా కెరియర్లో నేను చేసింది 35 సినిమాలే: బి.గోపాల్

Aradugula Bullet movie update

  • రీమేక్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు
  • కథ నచ్చితేనే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను
  • బాలయ్యతో మరో సినిమా చేయాలనుంది
  • 'ఆరడుగుల బుల్లెట్' అందరికీ నచ్చుతుంది

టాలీవుడ్లోని సీనియర్ స్టార్ డైరెక్టర్లలో బి.గోపాల్ ఒకరు. ఆయన పేరు చెప్పగానే 'స్టేట్ రౌడీ', 'అసెంబ్లీ రౌడీ' .. 'బొబ్బిలి రాజా' .. 'సమరసింహా రెడ్డి' .. 'నరసింహనాయుడు' వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు గుర్తుకు వస్తాయి. అలాంటి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆరడుగుల బుల్లెట్' రెడీ అయింది.

గోపీచంద్ హీరోగా బి. గోపాల్ రూపొందించిన ఈ సినిమాను ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "కథ నచ్చితే తప్ప నేను ఏ సినిమాను ఒప్పుకోను. అందువల్లనే ఇన్నేళ్ల నా కెరియర్లో కేవలం 35 సినిమాలు మాత్రమే చేయగలిగాను.

అలా కథ నచ్చడం వల్లనే నేను ఈ సినిమాను మొదలుపెట్టాను. వక్కంతం వంశీ అందించిన కథ గోపీచంద్ కి కూడా బాగా  నచ్చింది. మొదటి నుంచి కూడా నేను రీమేక్ సినిమాలకు వ్యతిరేకమే. కొత్త కథలతోనే సినిమాలు చేయాలనుంటుంది. అలా చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది" అని చెప్పుకొచ్చారు.

Gopichand
Gopal
Aradugula Bullet
  • Loading...

More Telugu News