Kannababu: రైతులకు లేని బాధ టీడీపీ నేతలకు ఎందుకు?: మంత్రి కన్నబాబు

Kannababu fires on TDP

  • రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది
  • రైతులు సంతోషంగా ఉండటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు
  • క్రాప్ హాలిడే ప్రకటించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

రైతుల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసా సహా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో రైతులు సంతోషంగా ఉండటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

క్రాప్ హాలిడే ప్రకటించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని... క్రాప్ హాలిడేని ప్రభుత్వం ఎక్కడ ప్రకటించిందో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త విద్యుత్ మీటర్ల వల్ల ఒక్క రైతుకైనా రూపాయి భారం పడిందా? అని ప్రశ్నించారు. కొత్త మీటర్లపై రైతులకు లేని బాధ టీడీపీ నేతలకు ఎందుకని ప్రశ్నించారు. పంట నష్టం జరిగిన వెంటనే రైతులకు నష్ట పరిహారాన్ని అందిస్తున్నామని చెప్పారు.

Kannababu
YSRCP
Farmers
Telugudesam
  • Loading...

More Telugu News