Chiranjeevi: ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం: బతుకమ్మ పండుగ సందర్భంగా చిరంజీవి

chiru wishes ts women

  • బ‌తుక‌మ్మ పండుగ ప్రారంభం సంద‌ర్భంగా ట్వీట్
  • తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతమ‌న్న చిరు
  • 9 రోజుల పాటు జ‌రిగే బ‌తుక‌మ్మ వేడుక‌లు అద్భుత‌మ‌ని వ్యాఖ్య‌

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ప్ర‌తిబింబించే బతుకమ్మ సంబురాలు నేటి నుంచి ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో నేటి సాయంత్రం మ‌హిళ‌లు ఈ సంబురాల‌ను షురూ చేయ‌నున్నారు. ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

బ‌తుక‌మ్మ పండుగ ప్రారంభం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ట్వీట్ చేశారు. 'ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం. ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు' అని చిరంజీవి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News