: ఎండలు బాబోయ్ ఎండలు
భానుడి భగభగలకి రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. సూర్యుడి ఉగ్రరూపానికి తాళలేక వడదెబ్బకి మృతి చెందినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో వెయ్యిమందికి పైగా మరణించగా, ఈ రోజు 210 మంది చనిపోయారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 22 మంది మృతి చెందగా, విజయనగరం జిల్లాలో 19 మంది తనువు చాలించారు. వరంగల్ జిల్లాలో 16 మంది మరణించారు. కరీంనగర్, ప్రకాశం జిల్లాల్లో 15 మంది చొప్పున చనిపోయారు. విశాఖపట్టణంలో అత్యధికంగా 47 డిగ్రీలు నమోదవగా కాకినాడ, విజయవాడల్లో 46 డిగ్రీలు నమోదయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్ లో 41 డిగ్రీలు నమోదయ్యాయి.