Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో నివేదిక సమర్పించిన త్రిసభ్య కమిటీ
- తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శికి నివేదిక సమర్పణ
- ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ
- మొత్తం రూ.63 కోట్లపైగా నిధుల దారి మళ్లింపు
ఇటీవల కలకలం రేపిన తెలుగు అకాడమీ నిధుల దారి మళ్లింపు కేసులో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయింది. వివిధ బ్యాంకు ఖాతాల్లో అకాడమీకి చెందిన ఖాతాల నుంచి ఈ సొమ్మును దారి మళ్లించారు. మొత్తం రూ.63 కోట్లకు పైగా నిధుల గోల్ మాల్ జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీతోపాటు ఏపీ మర్కంటైల్ సహకార సంస్థకు చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. అనంతరం ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కేసులో శాఖాపరంగా జరిగిన లోపాలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపి, నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శికి సమర్పించినట్లు సమాచారం. ఈ నిధుల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగినట్లు కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది.