AP High Court: ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
- 1,013 పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పు
- నాలుగు వారాల్లో బిల్లులు చెల్లించాలని ఆదేశం
- బకాయిలు 12 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టీకరణ
- ప్రభుత్వం జారీ చేసిన జీవో
ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులు కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా బిల్లులు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. 20 శాతం తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే కొంత చెల్లించి ఉంటే, మిగతా బకాయిలను పనులు చేసినప్పటి నుంచి 12 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు కోరుతూ దాదాపు 2 వేల పిటిషన్లు దాఖలు కాగా... నేడు 1,013 పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది.