Panja Vaisshnav Tej: 'కొండ పొలం'పై పెరిగిన అంచనాలు!

Konda Polam movie update

  • గిరిజనుల జీవితాల నేపథ్యంలో సాగే కథ
  • సంగీత దర్శకుడిగా కీరవాణి  
  • సందర్భానుసారం వచ్చే 7 పాటలు
  • అక్టోబర్ 8వ తేదీన సినిమా విడుదల  

వైష్ణవ్ తేజ్ రెండవ సినిమాగా 'కొండ పొలం' రూపొందింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, సాయిబాబు - రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గిరిజనుల జీవితాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో, వైష్ణవ్ తేజ్ సరసన నాయికగా రకుల్ నటించింది. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఇటీవల కర్నూల్లో ఆడియో ఫంక్షన్ జరుపుకుంది.

అయితే ఆడియో రిలీజ్ తరువాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలోని 7 పాటలు కూడా జనంలోకి దూసుకుపోయాయి. కీరవాణి .. సిరివెన్నెల .. చంద్రబోస్ రాసిన పాటలు జనం మనసులకు పట్టేశాయి.  

ముఖ్యంగా 'ఓబులమ్మా' .. 'శ్వాసలో' .. 'చెట్టెక్కి' పాటలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. యామిని ఘంటసాల .. రోహిత్ .. శ్రేయ ఘోషల్ .. కాలభైరవ పాడిన పాటలకి మంచి మార్కులు పడ్డాయి. ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో 7 పాటలు ఉండటం .. అవన్నీ కూడా కూడా ఆదరణ పొందడం విశేషంగానే చెప్పుకోవాలి.

Panja Vaisshnav Tej
Rakul Preet Singh
Saichand
  • Loading...

More Telugu News