Singareni: బొగ్గు కార్మికులకు రూ. 72,500 బోనస్ ఇచ్చేందుకు కోల్ ఇండియా, సింగరేణి అంగీకారం
![Coal India and Singareni announce Rs 72500 as bonus](https://imgd.ap7am.com/thumbnail/cr-20211005tn615bc2ceda06b.jpg)
- గతేడాది రూ. 68,500 బోనస్
- యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య నిన్న ఢిల్లీలో చర్చలు
- 43 వేల మంది సింగరేణి కార్మికులకు లబ్ధి
దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు ఇది గుడ్ న్యూసే. ప్రతి ఏడాది దసరా పండుగను పురస్కరించుకుని కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్న కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు ఈసారి ఏకంగా రూ. 72,500 బోనస్ (పీఎల్ఆర్) చెల్లించేందుకు అంగీకరించాయి. ఢిల్లీలో బోనస్‌పై నిన్న జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు చర్చించాయి. ఈ సందర్భంగా రూ. 72,500 చెల్లించేందుకు పరస్పరం అంగీకారం కుదిరింది. గతేడాది రూ. 68,500 బోనస్‌గా ఇవ్వగా, ఈసారి ఆ మొత్తాన్ని పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. ఫలితంగా 43 వేల మంది సింగరేణి కార్మికులకు లబ్ధి చేకూరనుంది.