Sajjanar: దిశ కమిషన్ విచారణకు హాజరైన సజ్జనార్

Sajjanar attends for Disha commission enquiry

  • దిశ ఎన్ కౌంటర్ కేసులో విచారణకు హాజరు
  • ఆయనతో పాటు క్లూస్ టీమ్ వెంకన్న కూడా హాజరు
  • 7వ తేదీన మరోసారి విచారణకు రావాలని సజ్జనార్ కు ఆదేశం

'దిశ' కమిషన్ ముందు సజ్జనార్ హాజరయ్యారు. దిశ హత్యాచారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్ కౌంటర్ చేసిన అంశంపై ఈ కమిషన్ విచారణ జరుపుతోంది. ఈరోజు జరిగిన విచారణకు సజ్జనార్ తో పాటు క్లూస్ టీమ్ వెంకన్న కూడా హాజరయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో దొరికిన ఆధారాలపై కమిషన్ కు క్లూస్ టీమ్ వెంకన్న నివేదిక అందించారు.

విచారణ సందర్భంగా... ఎన్ కౌంటర్ సమయంలో నిందితుల చేతిలో ఆయుధాలు ఉన్నాయా? ఉంటే వాటిపై వేలి ముద్రలను సేకరించారా? తదితర ప్రశ్నలను వెంకన్నకు కమిషన్ సంధించింది. ఘటనా స్థలి వద్ద పంచనామా చేసిన రెవెన్యూ అధికారిని కూడా ప్రశ్నించింది. మరోవైపు 7వ తేదీన మరోసారి విచారణకు రావాలని సజ్జనార్ ను ఆదేశించింది.

Sajjanar
Disha Commission
Encounter
  • Loading...

More Telugu News