KTR: చలాన్ విధించిన రోజు కారులో నేను లేను: కేటీఆర్

KTR appreciates Traffic SI who fined his car
  • గాంధీ జయంతి రోజున రాంగ్ రూట్లో వచ్చిన కేటీఆర్ వాహనం
  • చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య
  • కార్యాలయానికి పిలిపించి అభినందించిన కేటీఆర్
గాంధీ జయంతి రోజున రాంగ్ రూట్ లో వస్తున్న కేటీఆర్ కారును ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ వాహనానికి చలాన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ ఐలయ్యను కేటీఆర్ అభినందించారు. ఈరోజు ఐలయ్యను కేటీఆర్ తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఐలయ్య అంకితభావాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. నిబంధనలు ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా ఒక్కటేనని చెప్పారు.

నిజయతీగా పని చేసే  ఐలయ్య వంటి అధికారులకు తాము ఎప్పుడూ అండగానే ఉంటామని తెలిపారు. చలాన్ విధించిన రోజున తాను కారులో లేనని చెప్పారు. అనుకోకుండా రాంగ్ రూట్లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందిస్తున్నానని అన్నారు. తన కారుకు విధించిన చలాన్ ను కూడా చెల్లించినట్టు తెలిపారు.
KTR
Car
Wrong Route
Challan
SI

More Telugu News