Mamata Banerjee: ఉప ఎన్నిక‌లో భారీ ఆధిక్యంతో గెలుపుదిశ‌గా మ‌మ‌తా బెన‌ర్జీ

mamata leads in bhabanipur

  • 35 వేల ఓట్ల ఆధిక్యంలో మ‌మ‌త‌
  • ప్ర‌స్తుతం 13వ రౌండ్ లో ఓట్ల లెక్కింపు
  • మమతా బెన‌ర్జీకి 48,813 ఓట్లు
  • బీజేపీ అభ్య‌ర్థి టిబ్రేవాల్ కు 13,843  

పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్‌ అసెంబ్లీ  ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ గెలుపుదిశ‌గా ప‌య‌నిస్తున్నారు. ఈ రోజు జ‌రుగుతోన్న ఓట్ల లెక్కింపులో ఆమె బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ కంటే 35 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్ర‌స్తుతం 13వ రౌండ్ లో ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.  

మమతా బెన‌ర్జీకి 48,813 ఓట్లు రాగా, బీజేపీ అభ్య‌ర్థి టిబ్రేవాల్ కు 13,843 ఓట్లు వ‌చ్చాయి. ప‌శ్చిమ బెంగాల్‌లో మిగిలిన రెండు స్థానాలు షంసేర్‌గంజ్‌, జాంగీపూర్ ఉప ఎన్నిక‌ల్లోనూ టీఎంసీ నేత‌లే ముందంజ‌లో ఉన్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ కొన్ని నెల‌ల క్రితం పశ్చిమ బెంగాల్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓడారు. ముఖ్య‌మంత్రిగా ఆమె కొన‌సాగాలంటే ఎమ్మెల్యేగా గెల‌వాల్సి ఉంది.

  • Loading...

More Telugu News