Ninne Pelladatha: ప్రెస్ నోట్: స్టార్​ మాలో పాతికేళ్ల ప్రేమకావ్యం ‘నిన్నే పెళ్లాడతా’ సెలబ్రేషన్స్​

Iconic Love Story Ninne Pelladatha on Star Maa
  • కృష్ణవంశీ దర్శకత్వంలో కుటుంబ కథా చిత్రం
  • ఇంట్లోని పేర్లతో చక్కని కథ
  • తీపి గుర్తులు పంచుకోనున్న నాగ్, టబు, కృష్ణవంశీ
ప్రెస్ నోట్:  "నిన్నే పెళ్లాడతా"... ప్రతి తెలుగు ఇంటిలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. రెండు కుటుంబాలు; శీను, పండు అనే ఇద్దరు పంచుకున్న జ్ఞాపకాల ఆల్బమ్ లాంటి సినిమా. ఇప్పుడు ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని స్టార్ మా ఎన్నో విశేషాలతో సెలెబ్రేట్ చేస్తోంది. ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్ టైనర్ అని, ప్రేమ కావ్యం అని ప్రతి ప్రేక్షకుడు ఆస్వాదించిన ఈ సినిమాలో ప్రేమ జంటగా నాగార్జున, టబు ల మాజికల్ మూమెంట్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.
 
ఎన్నో తెలుగు లోగిళ్ళలో ఎక్కువగా వినిపించే పండు అనే పేరు ఇప్పటికీ కుర్రకారు ఇష్టపడే ఓ సగటు తెలుగు అమ్మాయి పేరు. ఆ రెండు కుటుంబాల్లో మనుషులు మన ఇంట్లోనే కనిపిస్తారు. అలాగే మాట్లాడుకుంటారు. ఎంతో సహజంగా ఉంటూనే తాను అనుకున్న కథని ఎంతో శక్తివంతంగా చెప్పిన దర్శకుడు కృష్ణ వంశీ కృషి ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది.
 
అందమైన కథ, అపురూపమైన అనుబంధాలు, రెండు గుండెలు పంచుకున్న ప్రేమానురాగాలు, ఈ నేపథ్యంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీతం, సాహిత్యం ... అన్నిటి ప్యాకేజీ లాంటి ఈ సినిమాకి ఇప్పటికీ ఫ్రెష్ లుక్ ఇస్తాయి. ఏటో వెళ్ళిపోయింది మనసు అని, కన్నుల్లో నీ రూపమే అని పాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి ఓ ప్రత్యేకమైన సినిమా కోసం హీరో, నిర్మాత నాగార్జున ; దర్శకుడు కృష్ణ వంశీ, పండు క్యారెక్టర్లో మురిపించిన టబు ఆనాటి తీపి గుర్తుల్ని స్టార్ మా ప్రేక్షకులతో పంచుకోబోతున్నారు.
 
ఈ ఆదివారం స్టార్ మా లో మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ మా లో కుటుంబం అంతా కలిసి చూడదగిన అసలైన ఫామిలీ ఎంటర్టైనర్ "నిన్నే పెళ్లాడతా". కేవలం సినిమా మాత్రమే కాదు.. మరిన్ని విశేషాలతో..!! "నిన్నే పెళ్లాడతా".. సెలబ్రేటింగ్ 25 ఇయర్స్ అఫ్ ఎమోషనల్ సాగా.. సెలబ్రేటింగ్ 25 ఇయర్స్ అఫ్ లవ్లీ జర్నీ..
 
"నిన్నే పెళ్లాడతా" ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/gD0zJkozQ80
 
Content Produced by: Indian Clicks, LLC
Ninne Pelladatha
Star Maa
Tollywood

More Telugu News