: టీమిండియాతో అక్టోబర్ లో తలపడనున్న ఆసీస్
టీమిండియా బిజీగా మారిపోనుంది. వచ్చే నెలలో వెస్టిండీస్ లో జరుగనున్న ట్రైసిరీస్ కోసం పయనం కానుంది. జూలై 7వ తేదీన చివరి మ్యాచ్ ఆడి కాస్త రెస్టు తీసుకోగానే ఛాంపియన్స్ ట్రోఫీ మొదలౌతుంది. ఇందులో కోహ్లీ మినహా ఇంచుమించు టీమిండియా టీం మొత్తం పాల్గొంటోంది. ఆ వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్దమవనుంది. ఆస్ట్రేలియా జట్టు ఏడు వన్డేలు, ఒక టీట్వంటీ మ్యాచ్ భారత్ తో ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు, పూణే, మొహాలీ, జైపూర్, నాగ్ పూర్. రాంచీ, కటక్ లలో వన్డేలు జరుగనున్నాయి. కాగా, ఇంకా టీట్వంటీ వేదిక ఖరారు కాలేదు. త్వరలోనే దాన్ని కూడా ఎంపిక చేసి ప్రకటిస్తారు. విండీస్ పర్యటన తరువాత టీమిండియా జట్టును ప్రకటించనున్నారు.