Telangana: తెలంగాణలో పెరిగిన సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీల వేతనాలు

Sarpanch zptc mpp salaries hiked in telangana

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • సర్పంచుల వేతనం రూ.6,500కు, జడ్పీటీసీ, ఎంపీపీల వేతనం రూ. 13 వేలకు పెరుగుదల
  • ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్న మంత్రులు

తెలంగాణలో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీల గౌరవవేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్‌లకు ఇప్పటి వరకు నెలకు రూ. 5 వేల వేతనం చెల్లిస్తుండగా, దానిని రూ. 1500 పెంచి రూ. 6,500; జడ్పీటీసీలు, ఎంపీపీలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 10 వేలకు రూ. 3 వేలు పెంచి రూ. 13 వేలు చేసింది.

జూన్ నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గౌరవ వేతనాల పెంపుపై మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు స్పందించారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వేతనాల పెంపుపై సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీపీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News