: నేను తప్పు చేయలేదు: శ్రీనివాసన్


బీసీసీఐ కోల్ కతాలో అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ మాట్లాడారు. కొద్ది రోజులుగా బీసీసీఐ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. తండ్రిగా, మామగా తీవ్ర కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నానని శ్రీనివాసన్ చెప్పారు. ఇప్పటివరకూ విధుల్లో ఏ విధమైన దుర్వినియోగానికి పాల్పడలేదని తెలిపారు. వరుసగా మీడియాలో వస్తున్న నిరాధార కధనాలతో వేదన చెందానని తెలిపారు.

గురునాథ్ పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించామనీ, చెన్నై ఫ్రాంచైజీ నుంచి అతనిని సస్పెండ్ చేశామనీ, అలాగే పోలీసులకు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తామని శ్రీనివాసన్ తెలిపారు. క్రీడాభిమానుల్లో ఏ విధమైన మార్పు రాలేదని, అందుకు నిదర్శనం కోల్ కతా మ్యాచ్ కు టికెట్లు అమ్ముడైపోవడమేనని తెలిపారు. ఐపీఎల్ ను నిషేధించాల్సిన అవసరం లేదని, ఐపీఎల్ ఎంతో మంది క్రీడాకారులను దేశానికి అందజేసిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News