IPL 2021: ఇంకెప్పుడు ఆడతాడు? కేదార్ జాదవ్‌పై మాజీ క్రికెటర్ విమర్శ
- ఐపీఎల్ 2021లో ఇప్పటి వరకూ భారీ ఇన్నింగ్స్ ఆడని జాదవ్
- ఆరు మ్యాచుల్లో కలిపి కేవలం 55 పరుగులే
- అయినా కొనసాగుతున్న 11 మందిలో ఎంపిక
ఐపీఎల్ 2021లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తక్కువ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఆ జట్టు బ్యాట్స్‌మెన్ చతికిలపడ్డారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ దిగ్గజ బౌలర్ షాన్ పొలాక్ స్పందించాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ జట్టులో వెటరన్ ప్లేయర్ కేదార్ జాదవ్ ఎంపికను పొలాక్ ప్రశ్నించాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో మొత్తం 6 మ్యాచులు ఆడిన ఈ హార్డ్ హిట్టర్.. కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. అతనికి మంచి జీతం లభిస్తోందని, అయినా సరే ‘జాదవ్ ఎప్పుడు ఆడతాడు?’ అని ప్రశ్నించుకోవాల్సిన స్థితిలో అభిమానులు ఉన్నారని ఈ సౌతాఫ్రికా మాజీ ఆటగాడు విమర్శించాడు. కేవలం గడిచిన మ్యాచుల్లో ప్లేయింగ్ ఎలెవన్‌లో అతను కచ్చితంగా ఉంటున్నాడు.
కానీ ప్రదర్శన మాత్రం అత్యంత ఘోరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అతని ఎంపికను ఏ విధంగా సమర్థించుకోవాలని పొలాక్ ప్రశ్నించాడు. కాగా, పంజాబ్ కింగ్స్‌తో తాజాగా జరిగిన మ్యాచులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన సన్‌రైజర్స్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.