Shilpa Shetty: జైలు నుంచి ఇంటికి వచ్చిన భర్త.. శిల్పాశెట్టి తాజా స్పందన!

Shilpa Shetty responds after her husband Raj Kundra back home from jail

  • పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా
  • కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇంటికి చేరుకున్న వైనం
  • కష్టాలు మనల్ని బలవంతులుగా మారుస్తాయన్న శిల్ప

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా దాదాపు రెండు నెలల పాటు జ్యుడీషియల్ రిమాండ్ ను అనుభవించిన సంగతి తెలిసిందే. ముంబైలోని కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజ్ కుంద్రా నాలుగు రోజుల క్రితం తన ఇంటికి చేరుకున్నారు. తన భర్త ఇంటికి వచ్చిన తర్వాత శిల్పాశెట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. కష్ట కాలం నుంచి కోలుకుంటున్నానని ఆమె తెలిపారు. క్రిస్టియాన్ బర్నార్డ్ పుస్తకంలోని ఒక కోట్ ను ఆమె పోస్ట్ చేశారు.

'బాధలు, కష్టాలు మనలను బలవంతులుగా మారుస్తాయి. వాటి నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం. మనలో ఉన్న బలాలు మనకు తెలియకపోవచ్చు. కానీ, కష్టాలు మనలోని బలాలను వెలికితీస్తాయి. అందరిలాగానే కష్ట కాలాన్ని నేను కూడా ద్వేషిస్తాను. అయితే కష్టాలను ఎదుర్కొనే బలం, వాటి నుంచి కోలుకునే స్థైర్యం నాకు ఉన్నాయనే విషయం నాకు తెలుసు' అని శిల్పాశెట్టి అన్నారు.

  • Loading...

More Telugu News