Nagarjuna: నాగార్జున సరసన నాయికగా ఇలియానా?

Iliana in Nagarjuna movie

  • షూటింగు దశలో ఉన్న 'ఘోస్ట్'
  • యాక్షన్ నేపథ్యంలో నడిచే కథ
  • హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగు
  • కాజల్ కి బదులుగా మరో కథానాయిక

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకి 'ఘోస్ట్' అనే టైటిల్ ను రీసెంట్ గా ఖరారు చేశారు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన నాగార్జున పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను అనుకున్నారు.

అయితే కాజల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ .. ఆమె సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. 'ఆచార్య' సినిమా షూటింగును పూర్తిచేసుకుంది కనుక బెంగలేదు. 'ఇండియన్ 2' సినిమా ఆగిపోయింది కనుక కంగారు లేదు. ఇక సెట్స్ పై ఉన్న నాగార్జున సినిమానే మరో హీరోయిన్ ను వెతుక్కోవాలి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా త్రిషనుగానీ .. ఇలియానాను గాని తీసుకోవచ్చుననే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఇలియానాను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. చివరికి ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది.

Nagarjuna
Ileana
Trisha
  • Error fetching data: Network response was not ok

More Telugu News