CBI Court: రాంకీ, ఓఎంసీ కేసులో విచారణకు హాజరుకాని ఇద్దరు మాజీ అధికారులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు

CBI Court issues non bailable warrants on former officials

  • సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
  • నేడు సీబీఐ, ఈడీ కేసుల విచారణ
  • విచారణకు గైర్హాజరైన వెంకట్రామిరెడ్డి, రాజగోపాల్
  • వారి తరఫు న్యాయవాదులు కూడా రాకపోవడంతో కోర్టు ఆగ్రహం

జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరుకాని మాజీ అధికారులపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.వెంకట్రామిరెడ్డి, గనుల శాఖ రిటైర్డ్ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ లపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. రాంకీ ఫార్మా కేసులో వెంకట్రామిరెడ్డి, ఓఎంసీ కేసులో రాజగోపాల్ విచారణకు హాజరుకావడం లేదని కోర్టు గుర్తించింది. కనీసం వారి తరఫు న్యాయవాదులు కూడా విచారణకు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది.

జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి నేడు సీబీఐ, ఈడీ కేసులు విచారణకు వచ్చాయి. ఈ కేసుల్లో నిందితులైన వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి తదితరులు కూడా గైర్హాజరైనా వారి తరఫున న్యాయవాదులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News