: హింసకు వ్యతిరేకంగా యావత్ జాతి ఉద్యమించాలి: ప్రధాని
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాయపూర్ ఆసుపత్రిలో ప్రధాని మన్మొహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంథీ పరామర్శించారు. అనంతరం ఈ దాడిని ఖండించారు. మావోలు తమ దుశ్చర్యలతో ప్రజలను భీతావహులను చెయ్యాలని చూస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని అన్నారు. హింసకు వ్యతిరేకంగా యావత్ జాతి ఉద్యమించాలని ప్రధాని పిలుపునిచ్చారు. మరో వైపు రాష్ట్రప్రభుత్వం మూడు రోజులను సంతాప దినాలుగా ప్రకటించగా, కాంగ్రెస్ కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చారు.