: నెట్ యూజర్లు జాగ్రత్త.. నిఘా కన్నుచూస్తుంది!


నెట్ ముందు కూర్చుని సైట్లు మీద సైట్లు చూసేస్తుంటాం. కానీ ఇకపై ఒకింత జాగ్రత్త సుమీ. ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా చూసిన సైట్ల వివరాలన్నీ ఆపరేటర్ల దగ్గర స్టోర్ అవుతాయి. అసాంఘిక, అక్రమ కార్యకలాపాల సమయంలో నిఘా, దర్యాప్తు సంస్థలకు ఈ సమాచారమే కీలక ఆయుధాలు కానున్నాయి. ఇప్పటి వరకూ మొబైల్ ఫోన్ల ద్వారా మనం నెరిపే సమాచారం వివరాలు నమోదు చేసే విధానం అమలులోఉంది. పలు నేరాలలో నిందితులను పట్టుకోవడానికి మొబైల్ కాల్ రికార్డ్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఇంటర్నెట్ వినియోగదారులు చూసిన సైట్ల వివరాలను కూడా నమోదు చేయడాన్ని అమల్లోకి తేవాలని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ప్రైవసీ మృగ్యం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News