: మావోయిస్టుల ఆచూకీ కోసం రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ దళాలు
ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు దాడికి తెగబడిన తరువాత వారెటువెళ్లారన్న ఆచూకీ తెలుసుకునేందుకు గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగాయి. కీలక నేతల మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన రాష్ట్ర, కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఛత్తీస్ గఢ్ ను ఆనుకుని ఉన్న రాష్ట్రాల అడవుల్ని జల్లెడపట్టేందుకు ఆయా రాష్ట్రాలను అభ్యర్ధించినట్టు సమాచారం. అందులో భాగంగా ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు గ్రేహౌండ్స్ పోలీసులు. మావోల ఏరివేతలో ఆరితేరిన ఆంధ్రాపోలీసులు, ఈ దాడికి మావోయిస్టు నేత కేశవరావు నేతృత్వం వహించినట్టు అనుమానిస్తున్నారు. మరో వైపు మావోల ఆచూకీ కనిపెట్టేందుకు నిఘావిమానాలు అందజేయాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.