Nithin: ప్రభుత్వ అధికారిగా కనిపించనున్న నితిన్!
![Macharla Niyojakavargam movie update](https://imgd.ap7am.com/thumbnail/cr-20210911tn613c384c249a0.jpg)
- నితిన్ 31వ సినిమా మొదలు
- యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా కృతి శెట్టి
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
నితిన్ తన 31వ సినిమాను మొదలుపెట్టేశాడు. 'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. నిన్న సాయంత్రం ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమామకి 'మాచర్ల నియోజక వర్గం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
టైటిల్ ను బట్టి ఇది రాజకీయాల నేపథ్యంలో సాగే కథ అనే విషయం అర్థమవుతోంది. పోస్టర్ ను బట్టి యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాలో నిజాయతీపరుడైన ఒక ప్రభుత్వ అధికారిగా నితిన్ కనిపించనున్నాడని, అవినీతిపరుడైన ఒక పెద్ద మనిషిని ఎదుర్కొనే పాత్రలో ఆయన కనిపిస్తాడని చెబుతున్నారు.
ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో ఎస్.ఆర్.శేఖర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. నితిన్ జోడీగా కృతిశెట్టి కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20210911fr613c38484f3d2.jpg)