Crime News: సైదాబాద్ బాలిక హత్యోదంతంపై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ స్పంద‌న‌

satyavati rathode on girl death case

  • వెంటనే విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకుంటాం
  • అధికారులు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలి
  • తెలంగాణలో మహిళలు, బాలికల రక్షణకు అనేక చ‌ర్య‌లు
  • అయినా అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జ‌రుగుతున్నాయి

హైద‌రాబాద్‌లోని సైదాబాద్, సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల బాలిక అదృశ్య‌మై ఆమె ప‌క్కింట్లో నివ‌సించే రాజు అనే యువ‌కుడి గదిలో విగ‌త‌జీవిగా క‌న‌ప‌డిన ఘ‌ట‌న‌పై తెలంగాణ మంత్రి స‌త్య‌వతి రాథోడ్ స్పందించారు. ఈ హత్యోదంతంపై వెంటనే విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకుని కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆమె అధికారుల‌ను ఆదేశించారు.

నిందితుడు పల్లంకొండ రాజుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రికి అధికారులు చెప్పారు. తెలంగాణలో మహిళలు, బాలికల రక్షణకు అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జ‌రుగుతుండ‌డంతో తల్లిదండ్రులు ఆందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నార‌ని ఆమె అన్నారు. ఇటువంటి దారుణాల‌ను ఉక్కుపాదంతో అణచివేయాలని అధికారులకు మంత్రి సూచించారు. పెద్ద ఎత్తున‌ ఆందోళ‌న‌కు దిగిన సింగ‌రేణి కాలనీ వాసులు సంయమనం పాటించాలని ఆమె కోరారు. ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News