PM Modi: పారాలింపిక్స్ పతకధారులతో ముచ్చటించిన ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi interacts with Paralympic medal winners
  • ఇటీవల ముగిసిన టోక్యో పారాలింపిక్స్
  • 19 పతకాలు సాధించిన భారత్
  • వాటిలో 5 స్వర్ణాలు
  • ఢిల్లీలో పారా అథ్లెట్లతో భేటీ
ఇటీవలే ముగిసిన టోక్యో పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబర్చారు. 5 స్వర్ణ పతకాల సహా మొత్తం 19 పతకాలు సాధించి అంతర్జాతీయ యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. కాగా, పారాలింపిక్స్ లో విశేషంగా రాణించి పతకాలు నెగ్గిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు కలిశారు.

 దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పారాలింపిక్స్ పతకధారులతో ఆయన ఆప్యాయంగా ముచ్చటించారు. టోక్యో క్రీడోత్సవ విశేషాలను వారిని అడిగి తెలుసుకున్నారు. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారంటూ పేరుపేరునా అభినందించారు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు.
PM Modi
Atheletes
Paralympics
India
Tokyo
Japan

More Telugu News