Vishnu Vardhan Reddy: ఇలా వేలాది మంది ర్యాలీ తీస్తే క‌రోనా రాదా జ‌గ‌న్ స‌ర్!: వీడియో పోస్ట్ చేసిన విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి

vishnu vardhan reddy slams jagan

  • మీ కాళహస్తి ఎమ్మెల్యే  బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి ర్యాలీ తీయించారు
  • వేల మందితో  జగనన్న అద్దాల మహల్  ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు
  • 20 మంది హిందు యువకులు వీధిలో వినాయకుడిని పూజిస్తే మాత్రమే వస్తుందా?
  • మీ వాళ్లు ఏమైనా క‌రోనా రహిత కార్యకర్తలా?  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వినాయక చవితి ఉత్సవాలపై వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం ప‌ట్ల బీజేపీ నేత విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. వైసీపీ నేత‌లు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు వేలాది మంది త‌ర‌లివ‌స్తే రాని క‌రోనా.. ప్ర‌జ‌లు వినాయ‌క చ‌వితి చేసుకుంటే మాత్రం వ‌స్తుందా? అని ఆయ‌న నిల‌దీశారు.

'ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు.. మీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి గారు వేల మందితో జగనన్న అద్దాల మహల్  ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తే కరోనా రాదా సార్?' అని ఆయ‌న నిల‌దీశారు.

'20 మంది హిందూ యువ‌కులు వీధిలో వినాయకుడిని పూజిస్తే మాత్రమే వస్తుందా? మీ వాళ్లు ఏమైనా క‌రోనా రహిత కార్యకర్తలా?' అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ కార్య‌క‌ర్త‌ల ర్యాలీకి సంబంధించిన వీడియోను ఆయ‌న పోస్ట్ చేశారు. కాగా, ఇప్ప‌టికే ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను బీజేపీ, విశ్వ హిందూ ప‌రిష‌త్ నేత‌లు కలిసి ప్ర‌భుత్వ తీరుపై ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News