Nithin: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్!

Suendar Reddy movies update

  • అఖిల్ హీరోగా 'ఏజెంట్'
  • సెట్స్ పై ఉన్న ప్రాజెక్టు
  • నితిన్ తోను సినిమా 
  • లైన్లో పవన్ ప్రాజెక్టు  

టాలీవుడ్ దర్శకులలో సురేందర్ రెడ్డి స్థానం ప్రత్యేకం. హీరోను చాలా స్టైల్ గా చూపించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన టేకింగ్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. ముఖ్యంగా ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ ను ఆవిష్కరించే తీరు డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.

చిరంజీవి .. ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ .. రవితేజ వంటి హీరోలతో సురేందర్ రెడ్డి సినిమాలు చేశారు. పవన్ తో ఒక సినిమా చేయడానికి ఆయనకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అయితే ప్రస్తుతం పవన్ తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన తరువాతనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలనుంది. ఈ లోగా రెండు సినిమాలు చేయవచ్చని సురేందర్ రెడ్డి భావించాడు.

అఖిల్ హీరోగా 'ఏజెంట్' సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లిన ఆయన, ఆ సినిమా షూటింగును చకచకా కానిచ్చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను నితిన్ తో చేయనున్నాడని చెబుతున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలోని సినిమాను పూర్తిచేసిన తరువాత, నితిన్ చేయనున్న సినిమా ఇదేనని అంటున్నారు. మొత్తానికి సురేందర్ రెడ్డి జోరుమీదే ఉన్నాడు.  

Nithin
Vakkantham Vamsi
Surendar Reddy
  • Loading...

More Telugu News