: సరైన సమయానికే కేరళ తీరానికి రుతుపవనాలు
అంచనాకు అనుగుణంగా జూన్ 3 నాటికి కేరళ తీరానికి రుతుపవనాలు చేరతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మహాసేన్ తుఫాను కారణంగా వారం రోజులు ముందుగానే రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకాయని తెలిపింది. ఒకవేళ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంలో అలస్యం అయినా మూడు రోజులకు మించకపోవచ్చని పేర్కొంది. కేరళ తీరాన్ని తాకిన తర్వాత వారం రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. ఇక, నెలాఖరు వరకూ అధిక ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.