Malreddy Ranga Reddy: హైదరాబాద్ లో కాంగ్రెస్ లో చేరిన వంద మంది టీఆర్ఎస్ కార్యకర్తలు

100 TRS workers joins Congress in Hyderabad

  • తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ కు షాక్
  • మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు 
  • పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న మల్ రెడ్డి

హైదరాబాద్ తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ కు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడారు. మాజీ ఎంపీటీసీ సుజాతా మోహన్ నాయక్, దేశ్యా నాయక్, రాజు, లచ్చు నాయక్, శంకర్ నాయక్, దస్రు నాయక్, రవి, రాము నాయక్ లతో పాటు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సీనియర్ నేత రొక్కం భీంరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Malreddy Ranga Reddy
Hyderabad
TRS
Congress
  • Loading...

More Telugu News