TTD: 'ధన ప్రసాదం' కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ

TTD started Dhana Prasadam

  • శ్రీవారి హుండీలో ప్రతి రోజు రూ. 10 నుంచి 20 లక్షల వరకు చిల్లర నాణేలు
  • చిల్లరను తీసుకునేందుకు ముందుకు రాని బ్యాంకులు
  • అతిథిగృహాల వద్ద రిసెప్షన్ కౌంటర్ల వద్ద 100 రూపాయల నాణేలను అందిస్తున్న టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను 'ధన ప్రసాదం' రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతిరోజు స్వామివారి హుండీలో రూ. 10 నుంచి 20 లక్షల వరకు చిల్లర నాణేలు వస్తుంటాయి. ఈ చిల్లరను తీసుకునేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. దీంతో, టీటీడీ వద్ద చిల్లర నాణేల నిల్వలు పెరగిపోయాయి. అందుకే ఈ నాణేలను నోట్లుగా మార్చుకునేందుకు టీటీడీ ధన ప్రసాదం కార్యాక్రమాన్ని తీసుకొచ్చింది. తిరుమలలో అతిథిగృహాల రిసెప్షన్ కేంద్రాల వద్ద ధన ప్రసాదం రూపంలో నాణేలను 100 రూపాయల పాకెట్ల రూపంలో కవర్లలో అందిస్తోంది.

అకామడేషన్ బుకింగ్ సమయంలో చెల్లించిన కాషన్ డిపాజిట్ ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో తిరిగి తెల్లించేలా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఒక రూపాయి నాణేలను ఇస్తున్నారు. రానున్న రోజుల్లో 2, 5 రూపాయల నాణేలను కూడా ఇవ్వబోతోంది. ఒకవేళ చిల్లర తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్ డిపాజిట్ ను భక్తులకు చెల్లించనున్నారు.

  • Loading...

More Telugu News