USA: అమెరికాలోని భారతీయ రెస్టారెంట్ లో స్పైసీ మటన్ కూరతో భోజనం చేశాక.. తానూ భారతీయుడినయ్యానన్న నైజీరియన్.. ఇదిగో వీడియో
- తొలిసారి భారతీయ వంటకం తిన్న లాంబోగిని
- గోవా ఫుడ్ ల్యాంబ్ విడాలూను సర్వ్ చేసిన రెస్టారెంట్
- ఫుడ్ కు డబుల్ చెల్లిస్తానంటూ కామెంట్లు
టచారా రే, లాంబోగినీ అనే నైజీరియన్ దంపతులు అమెరికాలోని బొనానీ టేక్ అవుట్ ఇండియన్ కిచెన్ అనే భారత రెస్టారెంట్ కు వెళ్లారు. లాంబోగినీ ఓ థాలీని ఆర్డర్ చేశాడు. దీంతో అన్నంతో పాటు పరాటాలు, ల్యాంబ్ విండాలూ (గోవాలో ఓ రకం మటన్ కూర) కూరను ఆ రెస్టారెంట్ వెయిటర్ తీసుకొచ్చి వారి ముందు పెట్టాడు. ‘ఇది తియ్యగా లేకుంటే బిల్లు కట్టను’ అంటూ లాంబోగినీ అన్నాడు.
‘అది తియ్యగా ఉండదు.. కారం కారంగా ఉంటుంది’ అని ఆ వెయిటర్ బదులిచ్చాడు. తర్వాత ఆ డిషెస్ ఓపెన్ చేసుకుని, అన్నంలో కూర కలిపి తిన్న లాంబోగినీ.. ఆ టేస్ట్ కు ఫిదా అయిపోయాడు. తొలిసారి అన్నం తిన్న అతడు అది సూపర్ అంటూ పొగిడేశాడు. ఆర్డర్ పెట్టిన థాలీని చకచకా లాగించేసి.. డబ్బులు డబుల్ కట్టేస్తా అన్నాడు. దాంతో పాటు మరిన్ని భారతీయ వంటకాలను పార్శిల్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లాడు.
ఈ అన్నం తిని తాను కూడా ‘భారతీయుడిని అయిపోయాను’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆ వీడియోను ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో నెటిజన్లూ ఫిదా అయిపోతున్నారు. కాగా, పోర్చుగీసు వంటకమైన ‘డి విన్హ డల్హోస్’ ఆధారంగా ల్యాంబ్/మటన్ విండాలూను వండుతారు.