Tollywood: రేపటి నుంచే టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ విచారణ!
- 12 మందికి నోటీసులు పంపిన ఈడీ
- హవాలా మార్గం ద్వారా విదేశాలకు డబ్బు బదిలీ
- రేపు పూరీ జగన్నాథ్ ను విచారించనున్న ఈడీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈసారి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసును విచారిస్తోంది. రేపటి నుంచి డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం కానుంది. తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు.
ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపించింది. మరో 50 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ 50 మందిని కూడా గతంలో ఎక్సైజ్ అధికారులు విచారించారు. డ్రగ్స్ కొనుగోలు కోసం హవాలా మార్గం ద్వారా డబ్బు విదేశాలకు చేరినట్టు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఫెమా చట్టాల ఉల్లంఘన కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈడీ నోటీసులు పంపిన వారి పేర్లు... వారి విచారణ తేదీ వివరాలు..!
- పూరి జగన్నాథ్ - ఆగస్ట్ 31
- ఛార్మి - సెప్టెంబర్ 2
- రకుల్ ప్రీత్ సింగ్ - సెప్టెంబర్ 6
- రానా దగ్గుబాటి - సెప్టెంబర్ 8
- రవితేజ - సెప్టెంబర్ 9
- శ్రీనివాస్ - సెప్టెంబర్ 9
- నవదీప్ - సెప్టెంబర్ 13
- ఎఫ్ క్లబ్ జీఎం - సెప్టెంబర్ 13
- ముమైత్ ఖాన్ - సెప్టెంబర్ 15
- తనీశ్ - సెప్టెంబర్ 17
- నందు - సెప్టెంబర్ 20
- తరుణ్ - సెప్టెంబర్ 22