Woman: విశాఖలో నిత్య పెళ్లికూతురు... ఆర్మీ ఉద్యోగికి టోకరా!

Woman cheats army employee

  • మోసపోయిన ఆర్మీ ఉద్యోగి ప్రసాద్
  • ఓ యువతితో పెళ్లి
  • లక్నోలో కాపురం
  • నగలు, నగదుతో గాజువాక వచ్చేసిన యువతి

విశాఖపట్నంలో ఓ నిత్య పెళ్లికూతురు భాగోతం బట్టబయలైంది. అప్పటికే ఇద్దరిని పెళ్లాడిన యువతి... మూడో వివాహం కూడా చేసుకుని ఆర్మీ ఉద్యోగికి టోకరా వేసింది. గాజువాకకు చెందిన ప్రసాద్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. లక్నోలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని పెళ్లి చేసుకున్న ప్రసాద్ ఆమెతో లక్నోలో కాపురం ప్రారంభించాడు. ఆ యువతి ప్రసాద్ తో అనేక బంగారు ఆభరణాలు కొనిపించింది. అంతేకాదు, పలు విడతల్లో దాదాపు రూ.90 లక్షల వరకు రాబట్టింది.

అనంతరం ఆమె నగలు, నగదుతో గాజువాక తిరిగొచ్చింది. అయితే ఆ యువతి తిరిగి లక్నోకు రాకపోకవడంతో ప్రసాద్ కూడా గాజువాక వచ్చి ఆరా తీయగా, ఆమె నిత్య పెళ్లికూతురు అన్న విషయం వెల్లడైంది. అప్పటికే ఇద్దర్ని పెళ్లి చేసుకుని మోసం చేసిందని, తాను మూడోవాడ్నని తెలిసి ఆర్మీ ఉద్యోగి ప్రసాద్ లబోదిబోమన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Woman
Marriages
Army Employee
Vizag
  • Error fetching data: Network response was not ok

More Telugu News