Murder: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఘోరం... తల్లీకూతుళ్ల హత్య

Mother and daughter murdered in Sattenapalli

  • నాగార్జుననగర్ లో నివసిస్తున్న పద్మావతి, ప్రత్యూష
  • రక్తపు మడుగులో తల్లీకూతుళ్లు
  • కత్తితో నరికి చంపిన దుండగుడు
  • సమీప బంధువుపైనే అనుమానం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల హత్య సంచలనం సృష్టించింది. నాగార్జుననగర్ లో నివసించే పద్మావతి (55), ఆమె కుమార్తె ప్రత్యూష (25) దారుణ రీతిలో హత్యకు గురయ్యారు. కత్తితో నరికి చంపడంతో ఇల్లంతా రక్తపు మడుగులా మారిపోయింది. సమీప బంధువే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. ఆస్తి పంపకాలే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు.

కాగా, పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. సీసీ టీవీ ఫుటేజి గనుక అందుబాటులో ఉంటే, ఆ ఫుటేజి ద్వారా కీలక సమాచారం లభ్యమవుతుందని భావిస్తున్నారు.

Murder
Mother
Daughter
Relative
Sattenapalli
Guntur District
  • Loading...

More Telugu News