Mekathoti Sucharitha: ఏపీ హోంమంత్రి సుచరిత రిజర్వేషన్ అంశంపై విచారణ చేపట్టిన జాతీయ ఎస్సీ కమిషన్

National SC Commission starts probe on Mekathoti Sucharitha reservation issue

  • వివాదాస్పదంగా సుచరిత రిజర్వేషన్ అంశం
  • ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రొటెక్షన్ ఫోరం
  • రిజర్వేషన్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
  • గుంటూరు జిల్లా కలెక్టర్ ను వివరాలు కోరిన కమిషన్

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత రిజర్వేషన్ అంశంపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో, తాను క్రిస్టియన్ అని సుచరిత స్వయంగా చెప్పినట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆరోపిస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ ను ఆమె దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం పేర్కొంది. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. వారం రోజుల్లోగా వివరాలు పంపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఎన్నికల అఫిడవిట్లో ఎస్సీ అని పేర్కొనడంతో గతంలోనూ ఆరోపణలు వచ్చాయి.

  • Loading...

More Telugu News