Afghanistan: ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని ప‌రిణామాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం అఖిలప‌క్ష స‌మావేశం పాల్గొన్న నామా నాగేశ్వ‌ర‌రావు, మిథున్ రెడ్డి

all party meet over present situation in Afghanistan

  • ఆఫ్ఘ‌న్ నుంచి భార‌తీయుల త‌ర‌లింపు
  • ఆ వివ‌రాలు వెల్ల‌డిస్తోన్న కేంద్ర ప్ర‌భుత్వం
  • జైశంక‌ర్ నేతృత్వంలో స‌మావేశం
  • పాల్గొన్న ఆఫ్ఘ‌న్‌లోని భార‌త రాయ‌బారి రుద్రేంద్ర తాండ‌న్

ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్లు రెచ్చిపోతుండ‌డంతో నెల‌కొన్న‌ ప‌రిస్థితుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించింది. విదేశాంగ మంత్రి జ‌య‌శంక‌ర్ నేతృత్వంలో ఈ స‌మావేశం కొన‌సాగుతోంది. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో భార‌తీయుల త‌ర‌లింపులో త‌మ వైఖ‌రిని అఖిల ప‌క్ష నేత‌ల‌కు కేంద్ర‌ ప్ర‌భుత్వం వివ‌రిస్తోంది.

టీఆర్ఎస్ నుంచి ఈ స‌మావేశానికి నామా నాగేశ్వ‌ర‌రావు, వైసీపీ నుంచి మిథున్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. దేశంలోని ఇత‌ర పార్టీల నుంచి కూడా ఆయా పార్టీల ఎంపీలు ఒక్కొక్క‌రు చొప్పున ఈ స‌మావేశంలో పాల్గొంటున్నారు.

ఆఫ్ఘ‌న్‌లోని భార‌త రాయ‌బారి రుద్రేంద్ర తాండ‌న్, విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి హ‌ర్ష్ శృంగ్లా కూడా ఇందులో పాల్గొని ప‌లు విష‌యాలను రాజ‌కీయ నేత‌ల‌కు వివ‌రిస్తున్నారు. ఆఫ్ఘ‌న్ నుంచి ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ద‌శ‌ల్లో భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చింది. మ‌రికొంద‌రిని తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తోంది.

  • Loading...

More Telugu News