Jayaram: రామ్ చరణ్ సినిమాలో మలయాళ హీరో?

Jayaram to play key role in Ram Charanfilm

  • శంకర్ తో రామ్ చరణ్ సినిమా 
  • హీరోయిన్ గా కియారా అద్వానీ
  • జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు
  • కీలక పాత్రలో జయరామ్  

పలు భారీ చిత్రాలను రూపొందించి, భారీ విజయాలను సొంతం చేసుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ఓ కొత్త సినిమా చేస్తున్నాడంటే అందరి కళ్లూ అటే చూస్తాయి. ఆ చిత్రానికి ఎక్కడా లేని క్రేజ్ వచ్చేస్తుంది. అందులోనూ ఆయన చేసేది మెగా హీరో రామ్ చరణ్ తో కావడంతో ఆయన తాజా ప్రాజక్టుకి మరింత క్రేజ్ వచ్చింది. 'ఆచార్య', 'ఆర్ఆర్ఆర్' చిత్రాల తర్వాత మెగా హీరో రామ్ చరణ్ చేసేది శంకర్ సినిమానే.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో భాగంగా ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ అప్ డేట్ వినిపిస్తోంది.

అదేమిటంటే.. ప్రముఖ మలయాళ హీరో జయరామ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ సినిమాలో ఆయన పాత్ర నెగటివ్ షేడ్స్ తో సాగుతుందని అంటున్నారు. ఆమధ్య జయరామ్ తెలుగులో 'అల వైకుంఠపురములో' చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన సంగతి విదితమే. ఇక శంకర్-చరణ్ సినిమా షూటింగును వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చరణ్ కి ఇది 15వ సినిమా. ఈ చిత్రానికి బిజీ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ చేయనున్నాడు.

Jayaram
Ramcharan
Shankar
Kiara Advani
  • Loading...

More Telugu News