Samantha: ఎవరినైనా బాధించి ఉంటే.. క్షమించండి: సమంత

Extremely sorry if I hurt anyone says Samantha
  • 'ఫ్యామిలీ మెన్ 2' వెబ్ సిరీస్ లో సమంత పాత్రపై విమర్శలు
  • కొంత కాలం పాటు నటనకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్టు సమంత ప్రకటన
  • కొత్త సినిమాలకు సైన్ చేయని సమంత
దక్షిణాదిన అగ్ర నటీమణుల్లో ఒకరిగా అక్కినేని వారి కోడలు సమంత కొనసాగుతోంది. తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను పోషించిన సమంత సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో సైతం నటించి... నటన పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది. ఆమె నటించిన 'ది ఫ్యామిలీ మెన్ 2' సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి సంబంధింది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డుల్లో బెస్ట్ యాక్ట్రెస్ (వెబ్ సిరీస్) అవార్డుకు కూడా ఎంపికయింది.
 
ఇక సమంత నటించిన 'శాకుంతలం' సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం తమిళ చిత్రం 'కాత్తు వకుల రెండు కాదల్' షూటింగ్ లో బిజీగా ఉంది. మరోవైపు ఒక తాజా ఇంటర్వ్యూలో ఆమె సంచలన ప్రకటన చేసింది. కొంత కాలం పాటు నటనకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నానని ఆమె ప్రకటించింది. కొంత కాలంగా కొత్త సినిమాలకు ఆమె సైన్ చేయడం లేదు. వచ్చే ఏడాదే ఆమె మళ్లీ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వార్తలు సమంత అభిమానులను షాక్ కు గురి చేశాయి.
 
మరోవైపు 'ఫ్యామిలీ మెన్ 2' వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన రాజి పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ... ఎవరినైనా తాను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరింది.
Samantha
Tollywood
Familyman 2
Acting
Break

More Telugu News