Taliban: ఆఫ్ఘనిస్థాన్ జైళ్ల నుంచి 100 మంది పాక్ ఉగ్రవాదుల విడుదల
- ఆఫ్ఘన్ లో తాలిబన్ల ఇష్టారాజ్యం
- నేరస్థులు, ఉగ్రవాదులకు జైళ్ల నుంచి స్వేచ్ఛ
- తాజాగా తెహ్రీకే తాలిబన్ ఉగ్రవాదుల విడుదల
- విడుదలైన వారిలో అగ్రశ్రేణి కమాండర్లు
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకం షురూ అయింది. తాము ఎవరికీ హాని తలపెట్టబోమని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు క్రమంగా ముసుగు తొలగిస్తున్నారు. పలుచోట్ల హింసకు తెగబడడమే కాకుండా, ఆఫ్ఘన్ లోని జైళ్లలో ఉన్న నేరగాళ్లు, ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పిస్తున్నారు.
తాజాగా, ఆఫ్ఘన్ కారాగారాల్లో ఉన్న 100 మంది పాకిస్థానీ ఉగ్రవాదులను తాలిబన్లు విడుదల చేశారు. విడుదలైన వారిలో తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు కూడా ఉన్నారు.
ఈ ఉగ్రవాదులు జైళ్ల నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే తిరిగి ఉగ్రవాద సంస్థలో చేరారు. తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా మార్గదర్శకత్వంలో కార్యకలాపాలు కొనసాగిస్తుంటుంది.