CM KCR: నదీ యాజమాన్య బోర్డుల సమావేశంలో తెలంగాణ బాణి గట్టిగా వినిపించాలి: సీఎం కేసీఆర్
- ఈ నెల 27న కేఆర్ఎంబీ సమావేశం
- తెలంగాణ గళం గట్టిగా వినిపించాలని స్పష్టీకరణ
- అన్యాయాన్ని వివరించాలని సూచన
- బలమైన వాదనలు వినిపించాలని దిశానిర్దేశం
ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ నీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. కేఆర్ఎంబీ సమావేశంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ వైఖరిని గట్టిగా వినిపించాలని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను, అభ్యంతరం తెలపాల్సిన అంశాలను అధికారులకు వివరించారు. దశాబ్దాలుగా తమకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా కోసం బలంగా వాదనలు వినిపించాలని పేర్కొన్నారు.