V Hanumantha Rao: పెండింగ్ లో 'హజీపూర్' శ్రీనివాస్ రెడ్డి కేసు.. సీజేఐ ఎన్వీ రమణకు వీహెచ్‌ లేఖ

V Hanumantha Rao writes letter to CJI NV Ramana

  • రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన హజీపూర్ హత్యాచారాలు
  • శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేల్చిన కింది కోర్టు
  • హైకోర్టులో ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉన్న కేసు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. హజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం చేసి, హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి కేసు ఏడాదిన్నరగా హైకోర్టులో పెండింగ్ లో వున్న విషయాన్ని సీజేఐ దృష్టికి తెచ్చారు.  

హజీపూర్ హత్యల ఘటన అప్పట్లో రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీటి లింకులు కర్నూలు వరకు వెళ్లాయి. ఒంటరి అమ్మాయిలు, మహిళలను టార్గెట్ చేసి, వారిని బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన కేసుల్లో శ్రీనివాస్ రెడ్డిని కింది కోర్టు దోషిగా తేల్చి, ఉరిశిక్ష విధించింది. అయితే, హైకోర్టులో ఈ కేసు ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉంది. కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని సీజేఐ దృష్టికి వీహెచ్ తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News