Gannavaram Airport: గన్నవరం విమానాశ్రయంకు స్పైస్ జెట్ విమాన సేవల రద్దు

SpiceJet stops services in Vijayawada airport
  • 30 శాతం ప్రయాణికులు కూడా బుక్ కాని పరిస్థితి
  • నష్టాల్లో సర్వీసులను నడపలేమన్న స్పైస్ జెట్
  • ఆన్ లైన్ బుకింగ్స్ నిలిపివేత
విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను స్పైస్ జెట్ సంస్థ రద్దు చేసుకుంది. 30 శాతం ప్రయాణికులు కూడా బుక్ కాని పరిస్థితి నెలకొనడమే దీనికి కారణమని వెల్లడించింది. నష్టాలతో విమాన సర్వీసులను నడపలేమని తెలిపింది. రెండు నెలల పాటు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ బుకింగ్స్ ను ఆపేసింది.

విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లే స్పైస్ జెట్ విమానాలు రద్దు కావడంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ చాలావరకు ఖాళీ అయింది. రెండేళ్ల క్రితం వరకు స్పైస్ జెట్ విమానాల్లో 80 శాతానికి పైగా బుకింగులు ఉండేవి. ప్రస్తుతం అవి 30 శాతానికి పడిపోయాయి. విమానాశ్రయంలో రన్ వేను పెంచినప్పటికీ సర్వీసులు తగ్గిపోతున్నాయి.
Gannavaram Airport
Vijayawada
SpiceJet

More Telugu News